Search This Blog

Friday, April 10, 2020

కరోనా పై యుద్దంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన ముగ్గురమ్మలకు జేజేలు. అగ్రదేశాల వెన్ను విరిచిన కరోనా భారతదేశంలో తలవంచడానికి ముగ్గురు మహిళా అధికారులు కీలకమైన పాత

కరోనా పై యుద్దంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన ముగ్గురమ్మలకు జేజేలు. అగ్రదేశాల వెన్ను విరిచిన కరోనా భారతదేశంలో తలవంచడానికి ముగ్గురు మహిళా అధికారులు కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమయ్యారు. వీరే ప్రీతి సుడాన్, డాక్టర్‌ నివేదిత గుప్త, సైంటిస్ట్ రేణు స్వరూప్. ప్రీతి సుడాన్ - హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ IAS ఆఫీసర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీ గారితో ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయుల ను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. డాక్టర్ నివేదిత గుప్త - స్వయంగా MBBS అయిన ఈమె మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్‌డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె కృషి ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపందేశాలను సమన్వయం చేస్తున్నారు. డాక్టర్ రేణు స్వరూప్ - జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్‌డీ చేసిన ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె 2001, 2007, 2015 లో రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు ఎన్నో ప్రశంసలు పొందాయి. వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో మొదటి వారు లవ్ అగర్వాల్. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ సాధించిన ఈ 48 ఏళ్ల యోగా నిపుణుడు విశాఖ జిల్లా కలెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రతి రోజు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నారు. అనేక వినూత్న ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఆదర్శమవుతున్నారు. మొబైల్ ఫోన్ల కరోనా కాలర్ ట్యూన్, కంటైన్మెంట్ స్ట్రాటజీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, క్లస్టర్ ఔట్ బ్రేక్ స్ట్రాటజీలు ఈయన రూపొందించినవే. మరో వ్యక్తి డాక్టర్ జితేంద్ శర్మ. సత్య సాయి బాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేసిన ఈయన ఏపీ రాజకీయ కక్షలకు బలైన సంగతి తెలిసిందే. విషయం ఢిల్లీ వరకు వెళ్ళగా ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా కలుగజేసుకుని ఈయనను మళ్ళీ ఏపీ మెడ్ టెక్ ఎం.డీ గా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అధిపతిగా నియమించారు. ఈయన పని ప్రారంభించిన కొద్ది రోజులలోనే దేశంలోనే మొట్టమొదటి గా రాపిడ్ టస్ట్ కిట్స్ ను తయారు చేయిస్తున్నారు. ఇవి కేవలం యాభై నిముషాలలో కరోనాను నిర్ధారిస్తాయి. ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్లు తయారవుతుండగా వచ్చే వారానికి ఇది ఇరవై ఐదు వేలకు చేరుతుందని అంచనా. మార్చి 31నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కేవలం 148 వెంటిలేటర్లు ఉండగా, జితేంద్ర శర్మ గారి నేతృత్వంలో నెలకు మూడు వేల వెంటిలేటర్లు తయారుచేయడానికి కృషి జరుగుతోంది. దీనితో ఆసియా మొత్తానికి ఈయన కృషి ఫలితాలు అందనున్నాయి. లాక్ డౌన్ మరో మూడు వారాలు పొడిగిస్తారని, జూన్ చివరి నాటికి మొత్తం బాధితుల సంఖ్య లక్షా ఎనభై వేలకు చేరుతుందని, మొత్తం మరణాల సంఖ్య మూడువేల లోపే ఉంటుందని, కరోనాపై భారత్ పూర్తిగా పట్టు సాధించినట్లేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు మేరా భారత్ మహాన్ భారత్ మాతాకి జై.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top