Search This Blog

Tuesday, October 15, 2019

ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,లోకెర్స్ లోని తులాల బంగారాలు కాదు...!*

ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది,తినకపోయినా కరిగిపోద్ది.
జీవితం కూడా అంతే..
ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది,చేయకపోయినా కరిగిపోద్ది.
అదేదో ఏంజాయ్ చేసిపోతే,ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.
తర్వాత ....
నరకం,స్వర్గం అంటారా..?
వున్నాయో,లేవో కూడా ఎవడికి తెలియదు,
నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.

తాగినోడు "ఎదవ" కాదు,తాగలేనోడు "పత్తిత్తు" కాదు.
పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే గ్యారంటీ లేదు.

ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది,ఎవడి జీవితం వాడిది.
ఫైనల్ గా చెప్పదేంటంటే...
టైం to టైం తినండి ..పడుకొండి,ఎక్కువ ఆలోచించకండి,ఆరోగ్యాలు జాగ్రత్త😛😛😛😛😜😜😜
*ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా?*

      *లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!.*

    *ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,లోకెర్స్ లోని తులాల బంగారాలు కాదు...!*

  *ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"*
  
*ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"*

  *ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"*

  *అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"*

*పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"*

  *పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"*

  *మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం*

*పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"*

  *ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"*

  *అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు  "ఐశ్వర్యం*

*బుద్ధికలిగిన బిడ్డలు  "ఐశ్వర్యం*

   *బిడ్డలకొచ్చే చదువు  "ఐశ్వర్యం"*

*భగవంతుడిచ్చిన ఆరోగ్యం  "ఐశ్వర్యం* 

    *చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి  "ఐశ్వర్యం*

*పరులకు సాయంచేసే మనసు మన  "ఐశ్వర్యం*

    *ఐశ్వర్యం అంటే చేతులు*
*లేక్కేట్టే కాసులు కాదు*

*కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం*
*మనసు పొందే సంతోషం ఐశ్వర్యం*......                            🙏🙏🙏

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top