*🔴అమ్మకు వందనం🙏🏻*
*పదాలు తెలియని పెదవులకు ఆ రెండక్షరాలు ఓ.అమృతవాక్యం...*
*అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు అసలైన అర్థం.....*.
*నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది. ఉగ్గుపాలు పట్టించడమేకాదు... ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు అహరహరం శ్రమిస్తుంది. ఆమే.. అమ్మ...*
*అందుకే అంటారు తల్లి ఎవరికైనా ప్రత్యక్ష్య దైవమని..*.
*భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు.*
*అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి..*
*అమ్మ ప్రేమ.. అంత తీయన కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు...*
*ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా ఓ అమ్మ కడుపునే పుట్టాడు....*
*అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే....*
*అమ్మ.. ఆ పిలుపులోనే తెలియని తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. తప్పుచేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది. కన్నపేగుకు ఏచిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది.*
*అమ్మ.. అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమను కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే... తల్లి కడుపు కూడా ఆనందంతో నిండిపోతుంది. తన ఒడినే బడిగా, గుడిగా చేసి తొలి పాఠాలు నేర్పుతుంది. తన నిస్వార్థ ప్రేమతో మనల్ని సమాజంలో ఆదర్శప్రాయులుగా మారుస్తుంది. చరిత్రలో మహాత్ములుగా, మహనీయులుగా నిలబెడుతుంది.అందుకే.. ఎన్ని యుగాలైనా.. ఎన్ని జన్మలెత్తినా స్వచ్ఛమైన ప్రేమను అందించటం కేవలం ఆమెకే సాధ్యం.. అవును అమ్మకు మాత్రమే సాధ్యం.*
*అమ్మ... ఆమె లేకపోతే జననం లేదు. ఆమె లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు....*
*పిల్లలకు బుడిబుడి అడుగులు వేయించటంతోనే తన బాధ్యత తీరిపోతుందని అనుకోదు.. మనకు పాఠాలు చెప్పకముందే మన భావి జీవితానికి బంగారుబాట వేస్తుంది. బిడ్డలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు తననుతాను పవిత్రంగా మలుచుకుంటుంది.*
*అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు. కానీ.. చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. కనిపించని దేవుడైనా.. కని పెంచిన నీ తర్వాతే అమ్మా..*
*కంటిపాపలా మమ్మల్ని కాపాడే మాతృమూర్తులందరికీ... మదర్స్ డే సందర్భంగా మీకిదే మా వందనం.🙏🏻*
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴