*EL, HPL అప్డేట్లో... !*
ఇప్పటివరకు DDOలు treasury.telangana.gov.in సైట్లో బిల్స్ ప్రిపేర్ చేసి, సబ్మిట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే! అయితే, మే ఫస్ట్ నాడు చెల్లించే ఏప్రిల్ 2019 మాసవేతన బిల్లులు సహా అన్ని రకాల బిల్లులను pdtreasury.telangana.gov.in సైట్లో ప్రిపేర్ చేయాల్సి ఉంది. దీనికోసం విద్యాశాఖలోని DDO లు.... ముఖ్యంగా హైస్కూల్ హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యక్తిగత, సర్వీస్ వివరాలను కొత్త సైట్లో అప్డేట్ చేయాల్సి ఉంది. అప్డేట్ చేసిన తర్వాతే బిల్స్ ప్రిపేర్ చెయ్యడం మంచిది. ఇలా అప్డేట్ చేయాల్సిన వాటిలో.... Earned Leave (EL), Half Pay Leave (HPL) నిల్వ వివరాలు కూడా ఉన్నయ్! అయితే, కొంతమంది DDO లు... Leave Balance వివరాలను ఎంట్రీ చేస్తున్నప్పుడు నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంలేదని కొందరు టీచర్లు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. 2019 లో టీచర్లకు వచ్చే 6 ELs లో..... ఫస్ట్ జనవరి 2019 నాడు.... GO Ms No 317 Edn Dept date: 15.09.1994 ప్రకారం.... 3 ELs అడ్వాన్స్ క్రెడిట్ చేసిన తర్వాతే... EL balance ని అప్డేట్ చేయాలి. అదేవిధంగా... HPLs ఏడాదికి ఇరవై కాబట్టి, ఆరు నెల్లకు పది, మూడు నెల్లకు ఐదు అంటూ proportionate గా కొందరు క్రెడిట్ చేస్తున్నట్టు తెల్సింది. అలా చెయ్యడం పూర్తిగా తప్పు. నియామకపు తేదీ ప్రామాణికంగా తీసుకొని... HPL బాలన్స్ ని అప్డేట్ చేసే తేదీ నాటికి.... పూర్తిచేసిన ప్రతి ఏడాది సర్వీస్ కి 20 HPL చొప్పున క్రెడిట్ చేసి, బాలన్స్ ని అప్డేట్ చేయాలి. మరికొందరు DDO లు... జీతనష్టపు అసాధారణ సెలవు (Extraordinary Leave Loss of Pay) కాలాన్ని మినహాయించి... HPL క్రెడిట్ చేస్తున్నట్టు తెల్సింది. కానీ, అలా చెయ్యడం పూర్తిగా తప్పు. జీతనష్టపు అసాధారణ సెలవు ఎన్ని సంవత్సరాలైనా... ఆ పీరియడుకు సైతం HPL విధిగా క్రెడిట్ ఇవ్వాలి. ఆతర్వాతే సైట్లో అప్డేట్ చెయ్యాలి. గతంలో ఎవరికైనా Extraordinary Leave Loss of Pay కాలానికి ఏటా వచ్చే 20 హాఫ్ పే లీవుల్లో కోత పెట్టిన పక్షంలో.... రికాస్టింగ్ అఫ్ లీవ్ అకౌంట్ కి High School HM/MEO కు దరఖాస్తు చేసుకొని... వాటిని పొందవచ్చు.