Search This Blog

Monday, February 25, 2019

Income tax Form 10E పై వివరణ:⚡⚡*

*⚡⚡Income tax Form 10E పై వివరణ:⚡⚡*

*1. Form- E అంటే ఏమిటి?*
Income Tax డిపార్ట్మెంట్ వారిచే గతంలో రావాల్సిన Arrears ప్రస్తుత FY లో వస్తే, వాటివల్ల పడే tax అప్పటి కంటే ఇప్పుడు ఎంత మొత్తం అధికం అవుతుందో అంతే మొత్తాన్ని 89(1) Sec ద్వారా పొందుటకు ఉపయోగించే ఫార్మే 10E.

*2. PRC Arrears ను Form 10E ద్వారా చూపించవచ్చా?*

అవును. Salary మరియు సంబంధిత Arrears అన్నింటినీ చూపించవచ్చు.

*3. PRC Arrears FY2014-15 కి చెందినవి. Form 10E ఉపయోగించుటకు అప్పుడు E Filing తప్పనిసరిగా చేయించి ఉండాలా?*

E Filing ను FY2017-18 నుండే తప్పనిసరి చేశారు. FY2012-13 నుండి FY2017-18 వరకు Taxable Income 5,00,000/- దాటిన వారు మాత్రమే తప్పనిసరిగా E Filing చేయాలి అని ఉంది.

*4. FY 2014-15 లో E Filing  చేయనందుకు Fine వేసే అవకాశం ఉందా?*

అప్పటి Taxable Income 5,00,000/- లోపు ఉంటే ఏ fine పడదు.

*5. FY2014-15 లో E Filing చేయని వారు Form 10E ని ఎలా ఉపయోగించుకోవచ్చు?*

అప్పటి Form 16 ను మీ DDO కి చూపించడం ద్వారా అప్పటి Taxable Income ను prove చేసుకొని Form10E ఉపయోగించుకోవచ్చు.

*6. Form10E ని ఎవరు అనుమతించాలి? DDO నా, DTO నా?*

Form 10E ని అనుమతించాలా, వద్దా అనేది DDO పరిధి లోని అంశం.
అప్పటి Taxable Income ఇంతా అని ఆధారాలతో (Form16 లేదా Efiling ఫారం) DDO ను సంతృప్తి పరిస్తేచాలు.

*7. Form 10E ని Tax calculation సమయంలో ఉపయోగించాలా? లేక Efiling సమయంలో ఉపయోగించాలా?*

Tax Calculation సమయంలోనే ఉపయోగించుకోవచ్చు.

*NSR Naidu.   Senior CA, Vijayawada.*

◼◼◼◼◼◼◼◼

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top