*స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...పురుషుడు ఎలా*
*ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఈ శ్లోకం చాలా మందికి తెలియదు.*
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః|
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః||
(కామందక నీతిశాస్త్రం)
*కార్యేషు యోగీ*
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
*కరణేషు దక్షః*
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
*రూపేచ కృష్ణః*
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. ఇక్కడ రూపం అంటే... బాహ్య రూపం కాదు. మానసికంగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
*క్షమయా తు రామః*
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
*భోజ్యేషు తృప్తః*
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
*సుఖదుఃఖ మిత్రం*
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - (ఈ ఆరు పనులు) సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
