Search This Blog

Tuesday, May 15, 2018

Today, psychology* *నాయకుడంటే*



<<< <<< CLICK HERE TO DOWNLOAD >>> >>>.           

*Today, psychology*

*నాయకుడంటే*


*గొప్ప పనులు చేసే*
 మహనీయులే గొప్ప నాయకులు కాదు. గొప్ప పనులు చేసే వారిని తయారుచేసేవాడే గొప్ప లీడర్ అవుతాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు లీడర్‌గా మారి తన ఫిలాసఫీని, తన ఆదర్శాలను విద్యార్థుల ముందు పెట్టి వారిని గొప్ప ఆవిష్కర్తలుగా* తయారుచేస్తాడు. ఉపాధ్యాయుడు ‘లీడర్’గా మారాలంటే తన ఫిలాసఫీకి *ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ‘నేనేందుకు చదువు చెప్పుతున్నాన’నే ప్రశ్న వేసుకోవాలి. గొప్ప విద్యార్థులు తయారుకావాలనే కోరిక అతడిలో వ్యక్తం కావాలి. గొప్ప అవకాశాలు, గొప్ప నైపుణ్యాలు నా విద్యార్థులకు రావాలనే ఆకాంక్ష ఉపాధ్యాయుని పనివల్ల కలగాలి. వ్యక్తిగా కాకుండా ఒక జట్టుగా ఎదగాలనే లక్ష్యం దిశగా* ఉపాధ్యాయుడు పయనం సాగించాలి.
తరగతి గది ఉద్యోగం చేసే *క్షేత్రం మాత్రమే కాదు, సమాజ నిర్మాణంలో అదొక సోపానమనే భావన కలగాలి. తరగతి గదిలో ఉండే ప్రతి విద్యార్థి తనలో దాగి వున్న అద్భుతమైన ప్రతిభను సామూహిక కార్యక్రమంలో ప్రదర్శించే స్థాయికి టీచర్ తీసుకురావాలి. పోటీతత్వంతో కాదు, సామూహికమైన టీమ్ స్పిరిట్‌గా మార్చే ప్రయత్నంగా చేయాలి. జయమైనా, అపజయమైనా కానీ అది* వ్యక్తులది కాదు, తప్పులు జరగవచ్చు. *తప్పులను సమర్థించుకోవడం కన్నా సవరించుకోవటంలోనే గొప్పతనముంటుంది. తరగతి పనులు చేసేటప్పుడు అధికార గర్వం కన్నా ప్రజాస్వామిక దృక్పథం ప్రధానం. ఇతరులను చివాట్లు పెట్టడం కన్నా అందర్నీ కలుపుకపోవటమే తన లక్ష్యం కావాలి. ఉపాధ్యాయుడు తను మాట్లాడినదానికన్నా వినటానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. శిక్షకుడు అనే భావనకు బదులుగా తరగతిలో తాను* భాగస్వామిననే భావన కలిగి ఉండాలి. తన గతం కన్నా, వర్తమాన శైలినే *ప్రధానమనుకోవాలి. నేను అనేదాని కన్నా మనం అనే భావనతోనే తరగతి గదికి నాయకత్వం వహించాలి*.




TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top