Search This Blog

Saturday, September 2, 2017

Cps related GOs info 01092017

*⚜N⚜*
🚨 *ప్రతి CPS ఉద్యోగి తెలుసుకోవలసిన G.O లు:*

👉 *కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ 1.1.2004 నుండి కాగా , దానికి అనుగుణం గా 1.9.2004 నుండి మన రాష్ట్ర ప్రభుత్వం 3 G.O లను విడుదల చేయటం ద్వారా ఉద్యోగుల కు cps విధానం అనే ఉరి తాడు ను తయారు చేసింది. ఆ 3 G.O లనే వారు త్రిబుల్ బెనిఫిట్ స్కీం అని అంటారు...*

👉 *ఆ 3 G.O లను మనం తెలుసుకోవటం cps ఉద్యోగి గా మనకు అవసరం...CPSTEA member గా అది మన భాద్యత.....*

🚨 *CPS ఉద్యోగి తెలుసుకోవలసిన ఆ 3 G. O లు:*

*⚜N *1. G.O MS No. 653. Finance pension-1:*

*ఇది 22.9.2004 న అసెంబ్లీ లో తీర్మానం జరిగింది.. దీనిప్రాప్తికి 1.9.2004 తర్వాత ఉద్యోగం లో చేరిన వారికి రివైజ్ డు  పెన్షన్ రూల్స్-1980 వర్తించవు.. ఈ జి.ఓ కారణం గా మనం గ్రాడ్యుటీ ని కోల్పోయాం.. కమ్యుటేషన్ ను కోల్పోయాం..*

*⚜N *2. G. O. Ms No. 654, finance pension-1:*

*ఇది కూడా 22.9.2004 న తీర్మానం జరిగింది.. ఈ G.O ప్రకారం క్రొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లో చేరిన వారందరికి G.P.F రూల్స్ -1935 వర్తించవు... దీనిప్రాప్తికి మనం పెన్షన్ ను కోల్పోయాం, ఫామిలీ పెన్షన్ ను కోల్పోయాం..*

*⚜N⚜3. G.O Ms No. 655, finance pension-1:*

*ఇది కూడా 22.9.2004 న అసెంబ్లీ ఆమోదించారు.. ఈ G.O ప్రాప్తికి ఈ పథకం లో ఉద్యోగి cps చందా నెలనెలా తమ జీతం నుండి రికవరీ చేయబడుతుంది.* *చందా(బేసిక్+డి.ఏ)మీద 10 % గా నిర్ణయించడం జరిగింది.*
*ఉద్యోగుల చందాకు సమానంగా ప్రభుత్వం తన వాటా ను జమ చేస్తుంది. ఈ రెండు మొత్తాలు న్యూ పెన్షన్ స్కీం ట్రస్ట్ కు జమ చేస్తారు. వీరు తిరిగి ఫండ్ మేనేజర్ ల( SBI- 34%, UTI-32%,LIC-34%)ద్వారా వివిధ పెన్షన్ పథకాలలో పెట్టుబడులు పెడతారు.అలా వచ్చిన మొత్తము లో ఉద్యోగి పదవీ విరమణ పొందేనాటికి జమ అయిన మొత్తం లో 60% ఉద్యోగికి చెల్లిస్తారు. మిగిలిన 40% యాన్యుటీ షేర్ లలో తప్పక పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.* *ఈ పెట్టుబడినుండి వచ్చే ఆదాయం ఆధారం గా ఉద్యోగికి /అతని కుటుంబ సభ్యులకు పదవీ విరమణ పొందిన తరువాత ఎంత మొత్తం వస్తుందో , ఎంత పెన్షన్ వస్తుందో ఖచ్చితంగా తెలియదు. ఈ జి.ఓ పర్యవసానం గా ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత సామాజిక, ఆర్ధిక భద్రతను కోల్పోతాడు...*

*మిత్రులారా ...మేలుకోండి...*

*CPS అంతమే పంతంగా కదలండి...*

*1⃣ఓకే సర్వీస్ 1⃣ఓకే పెన్షన్*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top