హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గం సుగమమైంది. బదిలీలు, పదోన్నతులు, నియామకాలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రస్థాయి, సచివాలయం, శాఖల అధిపతుల పోస్టుల బదిలీలకు అవకాశం కల్పించారు. ఉద్యోగుల విషయంలో అభ్యంతరాలు ఉంటే బదిలీలకు అవకాశం ఉండదు. లోకల్, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ పోస్టుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే ఆర్థిక శాఖలో బదిలీలపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయలేదు.