Search This Blog

Tuesday, February 16, 2016

త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

 -ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు
-ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెరుగుదల
-వారం రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు 

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రప్రభుత్వం, ప్రభుత్వ సంస్థ లు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన కీలక సమస్యలపై వారంరోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల కరువుభత్యం పెంపుపై రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు అంశాలపై సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించి జీవో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అయిదేండ్ల్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రమంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయేలా ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన 2/94 చట్టాన్ని తెలంగాణకు అన్వయించుకున్నది. ఈ చట్టం ప్రకారం పుల్‌టైమ్‌లో ఐదేండ్లు, పార్ట్‌టైమ్‌లో పదేండ్ల సర్వీసును పూర్తిచేసిన ఉద్యోగులను క్రమబద్దీకరించే వెసులుబాటు ఉంది. దీనిద్వారా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించడం సాధ్యం కాదు. 

ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్, టీఎస్‌పీఎస్సీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా మాత్రమే క్రమబద్ధీకరణ జరగాలి. ఈ పద్ధతిలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేయలేమని భావించారు. అందువల్ల చట్టంలో 10(ఏ) నిబంధనను కొత్తగా చేరుస్త్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులను నేరుగా ప్రభుత్వమే క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కలిగింది. దీనిద్వారా మరో 10 వేల మంది ఉద్యోగులు క్రమబద్దీకరణకు అర్హులవుతారని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని నిర్ణయించిన సర్కారు.. ఇందుకుగానూ నాలుగో స్లాబ్‌ను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నది. 

రాష్ట్రంలోని 40 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అందుతున్న జీతాల ఆధారంగా నాలుగు స్లాబ్‌లు లిస్ట్ చేస్తున్నారు. నెలకు రూ.6500 వేతనం తీసుకునే వాళ్లకు రూ.12,000, రూ.8,400 వేతనం పొందేవారికి రూ.15,000, రూ.10,900 వేతనం పొందేవారికి రూ.17,000 మేరకు వేతనాలు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే ఇంతకంటే అదనంగా వివిధ స్లాబ్‌లలో వేతనాలు తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. వారందరిని ఒకే క్యాటగిరి కిందకు తీసుకువచ్చిన అధికారులు 40 నుంచి 50 శాతం వరకు వేతనాలు పెంచేవిధంగా నాలుగో స్లాబ్ కింద ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రకు పంపారు. ఈ ఫైల్ సీఎం ఆమోదం పొందిన తరువాత తిరిగి ఆర్థికశాఖకు వస్తుంది. ఆ తరువాత ఉత్తర్వులు వెలువడుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3.14 శాతం పెంచుతూ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేయగానే ఆదేశాలు వెలువడుతాయి. వారంలో ఉత్తర్వులు వచ్చేలా దీనిపై కసరత్తును వేగవంతం చేశారు.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top