Search This Blog

Wednesday, February 3, 2016

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు


సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి ఉన్నది. సమాజంలో వున్న వ్యవస్థలను కాపాడేందుకు ప్రధానమైన అంగాలను నిర్మించవలసి ఉంది. ఇందుకోసం సమాజ నిర్మాణంలో అన్నింటికన్నా ప్రధానమైంది మిషనరీలను ఎన్నుకోవటం, విజనరీలను ఏర్పాటు చేసుకోవటం జరగాలి. ఆశయసిద్ధి కోసం సామాన్య మనిషికి కనపడని సమాజ లక్ష్యాలను నిర్ణయించటం, అటువైపుగా సమాజాన్ని తీసుకుపోవటాన్నే విజనరీ అంటాం. అందుకే మన రాజ్యాంగంలో ముఖ్యమంత్రి పదవిని ఎంచుకునేందుకు ప్రజానాయకులతో, సమర్థులైన ప్రజా ప్రతినిధులతో ఎన్నుకునే అవకాశం కల్పించబడింది. ముఖ్యమంత్రి సమాజాన్ని ఒక లక్ష్యం కోసమై ముందుకు నడిపిస్తాడు. ఆ లక్ష్యసాధనకు ప్రజలను సంసిద్ధం చేయాలి. ప్రజలను ఆ బాటలో నడిపించాలి. ఇది ముఖ్యమంత్రి దూరదృష్టిపైననే ఆధారపడి ఉంటుం ది. దార్శనికతగల నాయకుణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకునే కార్యక్రమాన్ని రాజ్యాంగం ప్రజలకు అప్పగించింది. అదే విధంగా ఇలాంటి నేతలకు సలహాదారులుగా ఉండేందుకు, పాలనను పకడ్బందీగా నడిపించేందుకు అనుభవం గల వారిని పాలనాధ్యక్షులుగా రాజ్యాంగమే నియమించబడటం జరిగింది. దేశ ఆర్థి క సాంఘిక పరిస్థితులపై సమగ్ర అనుభవంగల ఐఏఎస్ క్యాడర్‌ను నిర్ణయించటానికి అత్యున్నతమైన వ్యక్తులను ఎన్నుకునే అధికారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించారు. సమాజ నిర్మాణం లో రాబోయే తరాన్ని మానవ సంపదగా తయారు చేసే అత్యంత కీలకమైన బాధ్యతను ఉపాధ్యాయ వర్గానికి అప్పగించటం జరిగింది. ఉపాధ్యాయవర్గం రాబో యే యాభై ఏళ్ల కాలాన్ని ముందుకు నడిపించే తరా న్ని తయారుచేయాలి. నేటి సమస్యలకన్నా రేపటి సమస్యలను కొత్త ఆలోచనలు గల సమాజ నిర్మాతల ను తరగతి గదే తయారుచేయాలి. ఇది ఒక సామాజిక బాధ్యత. ఉన్నత కర్తవ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించేందుకు సన్నద్ధం కావడం మొత్తం సమాజం హర్షిస్తోంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రొఫెసర్. సామాజిక సమస్యల పై అనుభవం గల ఆచార్యుడు కావడం సంతోషించవలసిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం భావితరాలకు కావల్సిన అవసరాలను గుర్తించే మనుషుల్ని ఉపాధ్యాయులుగా ఎంపిక చేసే బాధ్యతను ఆయనకు అప్పగించిం ది. ఘంటా చక్రపాణి జనంలో తిరిగినవాడు, జ్ఞాన సముపార్జనగల వ్యక్తి, భావితరాలను ప్రభావితం చేయగల శక్తి ఉన్నవాడికే ఈ ఉపాధ్యాయుల నియామక బాధ్యతను అప్పగించటం సముచితంగా ఉన్నది. సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ నియామకం బాధ్యతలను పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పజెప్పటం రాష్ట్ర శ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తుం ది. ఇదొక శ్రేష్టమైన నిర్ణ యం. నేనొక ఉపాధ్యాయునిగా మనసారా అభినందిస్తున్నాను.

ఇప్పటి వరకు ఉపాధ్యాయ నియామకాన్ని రిక్రూట్‌మెంట్ అన్నారు. రిక్రూట్‌మెంట్ అనే పదం ఉన్న రూల్స్‌ను చిత్తశుద్ధితో పాటించే వారని అర్థం. టీచర్ పనికి రిక్రూట్‌మెంట్ కాదు, ఉన్న సమాజాన్ని రిపీట్ చేయటం కాదు. కొత్త సమాజానికి కావల్సిన మనుషులను తయారు చేయాలి. అందుకే ఉపాధ్యాయ నియామకాల్ని రిక్రూట్‌మెంట్ అనరు. సెలక్షన్ అం టారు. సామాజిక బాధ్యత తెలిసిన మనిషి చక్రపాణి కాబట్టి ఈ సెలక్షన్ పనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇచ్చారు. దీనివల్ల ఉపాధ్యాయుల స్టేటస్ కూడా పెరుగుతుంది. విద్యాసంస్థలంటే టీచర్ జీతాలు పెంచటం వరకే పరిమితమౌతుంది. కానీ ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయుల నియామకాన్నే సంపూర్ణంగా మార్చవలసి ఉన్నది. అధ్యాపక రంగంలో ఆరితేరిన ఉపాధ్యాయ వర్గానికి చెందిన చక్రపాణికే ఈ పని సమర్థులైన ఉపాధ్యాయుల ఎంపిక జరుగుతుంది. అప్పుడు తరగతి గది సంపూర్ణంగా ప్రక్షాళన చెందుతుంది. మంచి టీచర్లు వచ్చారంటే అది మంచి సమాజానికి పునాది అవుతుంది.
 సమాజ నిర్మాణంలో రాబోయే తరాన్ని మానవ సంపదగా తయారుచేసే అత్యంత
కీలకమైన బాధ్యతను ఉపాధ్యాయ వర్గానికి అప్పగించటం జరిగింది. ఉపాధ్యాయవర్గం రాబోయే యాభై ఏళ్ల కాలాన్ని ముందుకు నడిపించే తరాన్ని తయారుచేయాలి. నేటి
సమస్యలకన్నా రేపటి సమస్యలను కొత్త ఆలోచనలు గల సమాజ నిర్మాతలను తరగతి గదే తయారుచేయాలి. ఇది ఒక సామాజిక బాధ్యత. ఉన్నత కర్తవ్యం. 


నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకంలో అనేకరకాల మార్పులు జరుగుతూ వచ్చాయి. మారుతున్న కాలంతోపాటు ఉపాధ్యాయు ల ఎంపికలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఒకనాడు జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, డీఈఓ, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ రంగానికి చెందిన నిష్ణాతులు కలిసి ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసేవా రు. ఆ తర్వాత మొత్తం ఒకే కేంద్రం నుంచి ఒకే పరీక్ష ద్వారా ఎంపిక చేసే విధానం వచ్చింది. గతంలో రిటన్‌టెస్ట్‌తోపాటు ఇంటర్వ్యూలు కూడా ఉండేవి. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉపాధ్యాయుల నియామకంలో డె మో కూడా ఉండేది. ఆ తర్వాత పూర్తిగా ఆబ్జెక్టివ్ టైపులో మొత్తం ప్రశ్నలడిగే విధానం వచ్చింది. అయి తే ఈ అబ్జెక్టివ్ టైపులో ప్రశ్నలకు సమాధానాలు రాసి మార్కులు సంపాదించవచ్చును. దీంతో ఉపాధ్యాయుల ఎంపిక బాధ్యత పూర్తవుతుందనుకుంటే సరిపోదు. ఇలాంటి సందర్భంలోనే చక్రపాణి లాంటి వ్యక్తి ఎలా ఎంపిక చేసి పంపాలో నూతన కోణాలను కూడా వెతికి పట్టుకోగల సమర్థుడు. ఉపాధ్యాయ నియామకాల వ్యవస్థ సంపూర్ణంగా మార్చబడాలి. మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చేయబడాలి. అందుకు ప్రభుత్వంతో మాట్లాడి నూతన విధానాలను కూడా అవలంబించి ఈ విద్యారంగంలో కొత్త విప్లవాలను తీసుకువచ్చే పరిస్థితికి చక్రపాణి సమర్థుడు కాబట్టే మొత్తం సమాజం అభినందిస్తుంది. ఒక సమర్థుడైన ఒక టీచర్ నియమించబడకపోతే ముప్పై తరాల విద్యార్థులు దెబ్బతింటారు. సమర్థుడు లేకపోతే తరగతి గది కుప్పకూలిపోతుంది. తరగతి గది దెబ్బతింటే మొత్తం వ్యవస్థ నెర్రలుబాస్తుంది. దేశాన్ని రక్షించే కీలకబాధ్యతలు వహించే ఒక మిలటరీ ఆఫీసర్‌ను నియమించేందుకు 10 నుంచి 15 రోజులు అన్ని కోణాల నుంచి పలు పరీక్షలు చేస్తారు. భిన్న అంశాల నుంచి సమాధానాలు చెప్పమంటారు. వ్యక్తిత్వానికి సంబంధించి ప్రశ్నిస్తారు. 
ramaiah
సోషియాలజీ అంశాలపై టెస్ట్ పెడతారు. ఇలా ఇన్ని రకాలుగా పరీక్షలు చేసి మిలటరీ ఆఫీసర్ ను నియమిస్తారు. అలాగే రక్షణతోపాటు కీలకమైన సమాజ నిర్మాణాన్ని చేసే ఉపాధ్యాయుని నియామకంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోవల సి ఉంది. ప్రస్తుతం యాభై ఏళ్లలో చితికిపోయిన మన విద్యావ్యవస్థను చక్రపాణి తన కళ్లారా చూశాడు. ఆయన ఈ నియామకంలో ఏ జాగ్రత్తలు తీసుకోవా లి? ఎలా నియమించాలి? ప్రశ్నాపత్రం ఎట్లా ఉం డాలి? పరీక్ష తరువాత ఏ రకమైన పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలో ఆయన కొత్త రచన చేయవలసి ఉం ది. ఉపాధ్యాయ నియామకం గుమాస్తాలను నియమించేది కాదు. ఉపాధ్యాయ నియామకం సమాజానికి జీవికనందించేది.

ఈ నియామకాల ద్వారా తెచ్చే మార్పులు మొత్తం బోధనలో మార్పులు తేవాలి. బీఈడీ, డైట్ కాలేజీలు సంపూర్ణంగా సంస్కరించబడాలి. యూనివర్సిటీ క్వాలికేషన్లతోపాటు నిబద్ధత, నిమగ్నత గల వ్యక్తులు ఉపాధ్యాయులుగా నియమించబడితేనే విద్యాప్రమాణాలు పెరుగుతాయి.
(వ్యాసకర్త: శాసన మండలి సభ్యులు)





తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు: సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి ఉన్నది. సమాజంలో వున్

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top