Press Note :
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి - ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 268 ఎస్సీ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు టిగారియ సంఘం నాయకులతో కలిసి గురుకులాల కార్యదర్శి కృష్ణ ఆదిత్యను కోరారు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల ఉపాధ్యాయులకు 317జీవో అమల్లో జరిగిన అన్యాయం, బాధిత సమస్యలు , డీఏ బకాయిలు, 2007లో రెగ్యూలరైన ఉపాధ్యయులకు ఓపీఎస్ విధానం ,స్పౌజ్ బదిలీలకు 317జీవోలో అవకాశం కల్పించి బాధితులకు న్యాయం చేయాలని గురుకులాల ఉద్యోగుల సంఘం(TGARIEA) సభ్యులు ,ఉపాధ్యాయులతో కల్సి ఎస్సీ గురుకుల కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతిపత్రం అందించారు.
దీనికి సానుకూలంగా స్పందించిన కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కృషి చేస్తాను అని హామీచ్చారు.
ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ తారీఖున రెగ్యులర్, పార్ట్ టైం, అవుట్ సోర్సింగ్ వారికీ జీతాలు చెల్లించే ప్రయత్నం జరుగుతున్నదని, బిల్డింగ్ రెంట్స్, డైట్ బిల్స్ టాప్ ప్రియారిటీ లో గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని, వీటి తర్వాత ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలు పరిస్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమం విజయవంతం చేసిన ఉపాధ్యాయ వర్గానికి, చొరవ చూపిన ఎమ్మెల్సీ శ్రీ మల్కా కొమరయ్య గారికి, సమస్యలు పరిష్కరిస్తా అన్న కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య గారికి టీగారియ కృతజ్ఞతలు తెలియచేస్తున్నది.
డాక్టర్ మధు సూదన్
ఎస్ గణేష్
జి నాగిరెడ్డి.