📡 రిటైర్డ్ కాబోతున్న ఉపాధ్యాయ-ఉద్యోగులందరికీ ముఖ్య గమనిక ✍️
🔸 ఇటీవల కొందరు టీచర్లు/DDOల నిర్లక్ష్యం వల్ల రిటైర్మెంట్ తర్వాత 3-7 నెలలు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ పొందడంలో ఆలస్యం అవుతోంది.
✅ కావున, ఈ ముఖ్య విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి:
1️⃣ పదవీవిరమణ తేదీ:
▪️1వ తేదీ పుట్టినవారు – ముందు నెల 30/31 తేది రిటైర్మెంట్.
▪️2వ తేది లేదా తర్వాత పుట్టినవారు – ఆ నెల చివరి తేది రిటైర్మెంట్.
▪️మృతి చెందిన ఉద్యోగి – చనిపోయిన రోజే రిటైర్మెంట్ తేది.
2️⃣ పెన్షన్ ప్రపోజల్స్:
▪️రిటైర్మెంట్‌కు 6 నెలల ముందు SR అప్‌డేట్ చేసి AG ఆఫీసుకు పంపాలి.
▪️ఇంక్రిమెంట్ ఉంటే, ముందే నమోదు చేసి పంపవచ్చు.
3️⃣ GO No.235 ప్రకారం ఇంక్రిమెంట్ (27-10-1998):
▪️రిటైర్మెంట్ నెల తరువాత ఇంక్రిమెంట్ ఉంటే, అదనపు ఇంక్రిమెంట్ మంజూరు.
▪️ఇది పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్కు వర్తిస్తుంది.
4️⃣ పెన్షన్ ప్రతిపాదనలు పంపే విధానం:
🏫 ప్రాథమిక → MEO → AG Office
🏫 ఉన్నత పాఠశాల టీచర్లు → HM → AG Office
🏫 HM, MEOలు → DyEO/DEO ద్వారా
🏫 ఎయిడెడ్ → DEO ద్వారా
5️⃣ స్పెషల్ టీచర్ల & అప్రెంటీస్ సర్వీసు:
▪️398/- ఆర్డర్ ప్రకారం ఈ సర్వీసులు పరిగణనలోకి వస్తాయి.
6️⃣ పెన్షన్ లెక్కింపు:
▪️33 సంవత్సరాల సేవకు 5 సంవత్సరాల వెయిటేజ్.
▪️చివరి బేసిక్ పే ఆధారంగా లెక్కింపు.
7️⃣ ఉద్యోగి మృతి చెందినపుడు:
▪️ఫ్యామిలీ పెన్షన్ CPS వారికీ వర్తిస్తుంది.
▪️గ్రాట్యుటీ – కుటుంబ సభ్యులకు మాత్రమే.
▪️కమ్యుటేషన్ వర్తించదు.
📄 అవసరమైన పత్రాలు: Aadhar, PAN, Bank Passbook, Photo, విద్యా సర్టిఫికేట్లు.
8️⃣ పెన్షన్ అనుమతులు:
▪️AG Office నుండి DTO/STO కు పంపబడతాయి.
9️⃣ STO కార్యాలయంలో ప్రక్రియ:
📄 PPO కాపీ, No Dues, Annexures, డిక్లరేషన్ ఫారాలు, బ్యాంక్ పాస్‌బుక్, Aadhar, PAN, 3 ఫొటోలు తీసుకెళ్లాలి.
🔟 హెల్త్ కార్డు:
🏥 రిటైర్మెంట్ తర్వాత కొత్త పెన్షనర్ హెల్త్ కార్డు తీసుకోవాలి.
💻 EHS లో లాగిన్ అయి పత్రాలతో అప్లై చేయాలి.
ఈ సమాచారం ఇతర రిటైర్మెంట్ అవుతున్న స్నేహితులతోనూ పంచుకోండి.