![]() |
రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకు లాల్లో లైబ్రేరియన్ పోస్టులు ఫిలప్ చేసిన గత ప్రభుత్వం లైబ్రరీలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా లైబ్రేరియన్లు.. హాస్టళ్లలో వార్డెన్ విధులు నిర్వ ర్తించాల్సి వస్తున్నది. తమను లైబ్రేరియన్ పోస్టులో తీసుకొని ఇతర పనులు చేయాలని ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్ఐఎస్ ఆదేశించడం సరికాదని వారు ఆరోపిస్తు న్నారు. స్టేట్లోని మహాత్మజ్యోతిబాపూలే బీసీ గురుకు లాల్లో సుమారు 200 మంది లైబ్రేరియన్లు సంస్థ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు..
పోస్టు ఒకటి.. పని మరొకటి :-
గురుకులాల్లో నియమితులైన లైబ్రేరియన్లు.. విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించాలి. వారిలో పరిశోధనాత్మక దృక్పథం ఏర్పర్చాలి. సమాచారం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించాలి. కానీ ప్రస్తుతం ఉన్న లైబ్రేరియన్లు ఇందుకు భిన్నంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అనేక గురుకులాల్లో ప్రభుత్వాలు సరైన లైబ్రెరీలు ఏర్పాటు చేయలేదు. మౌలిక వసతులు, పుస్తకాల సరఫరా, పత్రికలు, ఇతర వస్తువులు సమకూర్చలేదు. కనీసం లైబ్రెరీకి ప్రత్యేక రూమ్లు సైతం లేవనే ఆరోపణలున్నాయి. సంస్థ సైతం ఫెసిలిటీస్ గురించి ఆలోచించకుండా వారిపై వర్క్ ప్రెషర్ వేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిని కొందరు లైబ్రేరి యన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సం నుంచి తాము వార్డెన్ విధులు నిర్వహించబో మంటూ ఉన్నతాధికారులతో తెగేసి చెప్పినట్టు తెలిసింది.
వార్డెన్ డ్యూటీలు చేయలేం :-ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శిని కలిసిన లైబ్రేరియన్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురు కులాల్లో పని చేస్తున్న లైబ్రేరియన్లు సోమవారం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి సైదులును కలిశారు. లైబ్రేరియన్ పోస్టులో చేరిన తాము వార్డెన్ డ్యూటీలు చేయలేమని తెగేసి చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా గురుకులాల్లో కావా ల్సిన అవసరాలు, ఇండెంట్లను వారు కార్యదర్శికి లిఖిత పూర్వకంగా అందజేశారు. దీనికి కార్యదర్శి సైతం సానూకులంగా స్పందించి, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చినట్టు సమాచారం.
డ్యూటీలపై ఉద్యోగుల వ్యతిరేకత ,కనీస సదుపాయలు లేక ఇబ్బందులు
సమస్యలు పరిష్కరించాలని సంస్థ కార్యదర్శికి వేడుకోలు