Search This Blog

Sunday, May 11, 2025

Heart Attack Prevention: గుండె పోటు నివారణకు ప్రకృతిపరమైన చిట్కాలు.. ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్ క్లీన్

 Heart Attack Prevention Symptoms| ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నవారి సంఖ్య ప్రతి సంవత్సరం విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ప్రకారం.. ప్రతి ఏడాది 1.79 కోట్ల మంది గుండె పోటు లేదా ఇతర గుండె సంబంధిత రోగాల కారణంగా చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలలో ఈ సంఖ్య 32 శాతంగా ఉంది అంటేనే పరిస్థితి చాలా సీరియస్ అని అర్థమవుతోంది. భారతదేశంలో మరీ ప్రత్యేకంగా ఈ మరణాల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ అని ది లాన్సెట్ రిపోర్ట్ తెలిపింది. దేశంలో సంభవించే మరణాలలో గుండె సంబంధిత అనారోగ్యం కారణంగా చనిపోయేవారు 28 శాతంగా ఉంది.


ఈ సమస్యకు ముఖ్య కారణాలు సరైన జీవన విధానం లేకపోవడం, అనారోగ్యమైన ఆహారం అలవాట్లు కలిగి ఉండడం. ఈ రెండు కారణాల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె సంబంధిత రోగాల బారిన పడతారు. నిజానికి ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది రక్త నాళాల్లో పేరుకుపోతుంది. దీంతో రక్త నాళాల్లో రక్తం ప్రవహించేందుకు ఇరుకుగా ఉంటుంది. ఫలితంగా రక్తం ప్రవాహం తగ్గిపోతుంది. ఈ కారణంగా రక్తం మరింత బలంగా పంప్ చేసేందుకు గుండె మీద ఒత్తిడి పడుతుంది. అప్పుడు రక్తపోటు సమస్య వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త నాళాలు గట్టిబడితే రక్త ప్రవాహం తగ్గిపోయి, గుండెకు ఆక్సిజన్ సరిగా చేరదు. అప్పుడు గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా నివారించాలంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి. లేదా రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.


చెడు కొలెస్ట్రాల్ నివారణకు ఇలా చేయండి..
ఉదయాన్నే ఓట్స్ తో బ్రేక్ ఫాస్ట్: గుండె ఆరోగ్యానికి ఓట్స్ చాలా మంచి ఆహారం. ఇందులో ఫైబర్, బెటాగ్లూక్యాన్ పోషకాలు ఎక్కువ. కొలెస్ట్రాల్‌ని ఫైబర్ జీర్ణకోశంలోకి పంపించి రక్తంలో చేరకుండా నివారిస్తుంది. అందుకే ఉదయాన్నే ఓట్స్ తో టిఫిన్ చేస్తే కొలెస్ట్రాల్ సమస్య తగ్గిపోతుంది.

ప్రతిరోజు నడవాలి: వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే మరీ తీవ్రంగా ఉండకూడదు. ప్రతిరోజు లేదా వారానికి అయిదు రోజులు వాకింగ్ కనీసం రోజుకు 30 నిమిషాలు నడవాలి. అప్పుడు మంచి కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతుంది. వాకింగ్ చేస్తే రక్త ప్రవాహం కూడా మెరుగవుతుంది. తద్వారా రక్తంలోని ఎక్స్‌ట్రా కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. వాకింగ్ చేసేందుకు సమయం లేకుంటే రోజుకు రెండు సార్లు 15 నిమిషాల చొప్పున భోజనం చేసిన తరువాత నడవండి.

ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తినాలి: డ్రై ఫ్రూట్స్ లోని పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. బాదాం, వాల్ నట్స్, పీనట్స్, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి డైట్ లో తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గిపోతుంది.

ఆలివ్ ఆయిల్: శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు ఆలివ్ ఆయిల్ వినియోగించాలి. దీని కోసం వంట చేసే సమయంలో కూరగాయలు వేయించాడినికి ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి లేదా సలాడ్ తినే టప్పుడు దానిపై ఆలివ్ ఆయిల్ స్ప్రింకిల్ చేయడం, హోల్ గ్రెయిన్ బ్రెడ్ ని ఆలివ్ ఆయిల్ లో డిప్ చేసి తినడం లాంటివి అలవాటు చేసుకోవాలి.

గ్రీన్ టీ తాగండి: గ్రీన్ టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య లాభాలున్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ నివారణకు గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలోని క్యాటెచిన్స్ పవర్ ఫుల్ యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి, ఆక్సిడేషన్ నివారిస్తుంది. ఫలితంగా రక్తనాళాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. రోజుకు 2 లేదా 3 కప్పులు షుగర్ లేదని గ్రీన్ టీ తాగితే చెడు కొటెస్ట్రాల్ (ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్) రెండు నుంచి అయిదు శాతం తగ్గిపోతుంది.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top