Search This Blog

Sunday, July 10, 2022

Guava : రోజూ రెండు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

 Guava :






  మ‌న‌కు విరివిగా త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్లల్లో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు కొన్ని రోజులు మిన‌హా సంవ‌త్స‌రం అంతా ల‌భిస్తూనే ఉంటాయి. పూర్వ‌కాలంలో గ్రామాల‌లో ఇంటికొక జామ‌చెట్టు ఉండేది. ఇత‌ర పండ్ల లాగా జామ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. జామ‌కాయ‌ల‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఆకుకూర‌ల్లో ల‌భించే పీచు ప‌దార్థాల కంటే రెండిత‌ల పీచుప‌దార్థాలు జామ‌కాయ‌ల్లో ఎక్కువ‌గా ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది.

జామ‌కాయ‌ల ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల కాలేయం ప‌నితీరు మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. ప్ర‌తి రోజూ జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల లేదా జామ‌కాయ ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను న‌మిలి తిన‌డం వ‌ల్ల దంతాలు గ‌ట్టిగా త‌యార‌వుతాయి. దంతాల స‌మ‌స్య‌ల‌ను, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌ను, గొంతు నొప్పిని న‌యం చేయడంలో జామ ఆకులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. జామ ఆకుల‌ను మెత్త‌గా దంచి దంతాల‌కు, చిగుళ్ల‌కు లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. జామ ఆకుల‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల జీర్ణక్రియ మెరుగుప‌డుతుంది. ఆక‌లి కూడా పెరుగుతుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల వికారం, వాంతులు త‌గ్గుతాయి.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top