శ్రీరామ నవమి.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు .
ఛైత్రశుద్ధ నవమి... ఈ రోజే శ్రీరాముల వారు జన్మించిన తిథి... ఈ రోజును హిందువులు అత్యంత శోభాయమానంగా తమ ఇంట్లోని వేడుక లా జరుపుకుంటారు... ఇప్పటికీ శ్రీరామ కళ్యాణం అయిన తర్వాతనే వారి ఇంట కళ్యాణ వాయిద్యాలు మ్రోగే విధంగా ఏమైనా శుభకార్యములు ఉన్నా వాయిదా వేసుకుని దైవ కార్యాన్నే ప్రథమంగా జరుపుతారు... . ఏటా ఊరూరా నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి, పానకం, వడపప్పు పంచిపెడతారు.
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’ అందరికి నవమి శుభాకాంక్షలు
శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు