Search This Blog

Friday, June 18, 2021

థామస్‌ ఆల్వా ఎడిసన్ Thomas Alva Edison birthday February 11

Thomas Alva Edison(థామస్ ఆల్వఎడిసన్) 1847 ఫిబ్రవరి 11న అమెరికాలో జన్మించారు. చదువుపరంగా పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా, పరిశోధనలు చేయడానికి ధనవంతుడు కాకపోయినా, విజ్ఞానశాస్త్రంపై ఉన్న మక్కువతో ఎన్నో పరిశోధనలు చేసిన వ్యక్తి థామస్ ఆల్వఎడిసన్. ఈయన పాఠశాల విద్యాభ్యాసం ఎక్కువగా ఇతని తల్లి వద్దనే జరిగింది. చిన్న నాటి నుండి తనచుట్టూ ఉన్న పరిసరాలలోని విషయాలను గమనించడం బాగా అలవాటు చేసుకున్నాడు. ఇదే ఇతనిని పరిశోధనలవైపు ఆకర్షించింది. Thomas Alva Edison(థామస్‌ ఆల్వా ఎడిసన్) ఈయన తన పరిశోధనలతో యూనివర్సల్ ప్రింటర్, గ్రామ్ఫోన్, విద్యుత్ బల్బు, టెలిగ్రాఫ్, మైక్రోఫోన్ వంటి ఎన్నో కొత్త పరికరాలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణలలో ముఖ్యంగా మనం చెప్పుకోవలసింది విద్యుత్ బల్బు గూర్చి. ఎన్నో వందల ప్రయత్నాలలో విఫలం చెందినప్పటికీ, నిరాశచెందక ధైర్యం కోల్పోక చివరికి విజయం సాధించారు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విధంగా తన ఊహశక్తితో అనేక గొప్ప ఆవిష్కరణలు చేశారు. ఎన్ని తరాలు మారినా తనపేరును చిరస్థాయిగా గౌరవించే విజయ పతాకం ఎగురవేశారు. ఆటోమేటిక్‌ టెలిగ్రాఫ్‌ కోసం ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్లను కనిపెట్టడం ఆయన మొదటి ఆవిష్కరణ. 1877లో ఫోనోగ్రాఫ్‌ను కనుగొన్నాడు. 40 గంటలపాటు పనిచేసే కా ర్బనైజ్‌డ్‌ కార్బన్‌ త్రెడ్‌ ఫిలమెంట్‌ను తయారు చేసి 1879 అక్టోబర్‌ 21న ప్రయోగాత్మకంగా ప్రదర్శించాడు.థామస్ అల్వా ఎడిసన్ మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. 1882లో న్యూయార్క్‌లో విద్యుత్‌ స్టేషన్‌ను స్థాపించాడు. కైనెటోస్కోప్‌ ప్రాసెస్‌ ద్వారా 1890లో మోషన్‌ పిక్చర్స్‌ను తీయడం మొదలుపెట్టాడు. మైనింగ్‌, బ్యాటరీ, రబ్బర్‌, సిమెంట్‌ రక్షణోత్పత్తులు-మన జీవి తంలో భాగమైపోయిన ఎన్నింటికో ఎడిసన్‌ ఆద్యుడు. ఆయన ఆవిష్కరణలు సమాజం రూపురేఖలనే మార్చివేశాయి. ఆవిరి యంత్ర దశ నుండి విద్యుత్‌కాంతుల్లోకి నాగరికత ప యనించడానికి ఆయన పరిశోధనలే కారణం. 1300 ఆవిష్కరణలపై పేటెంట్‌ హక్కులు పొందాడు. ఆయన అంత్యక్రియల రోజు ఆయన గౌరవార్ధం అమెరికా ప్రజలు తమ గృహాల్లో లైట్లను ఆర్పివేసి నివాళి అర్పించారు. ఫిబ్రవరి నెలలో గల ముఖ్యమైన రోజులు.




TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top