పదవ తరగతి పరీక్షలలో 10 G.P.A. సాధించడానికి ఉపయోగపడే అంశాలు.
1. పదవతరగతి పరీక్ష చాలా తేలికైన పరీక్ష. ఒక నెల రోజులు బాగా చదివినా 10 G.P.A. ఆశించవచ్చు.
2. పదవతరగతి పరీక్ష చాలా ముఖ్యం అన్న వాళ్ళ మాట పట్టించుకోకండి. తర్వాత ఇంటర్మీడియట్లో , డిగ్రీలో అలాగే చెప్తారు.
3. ఆరోగ్యం, విశ్రాంతి విషయంలో సాధారణ జాగ్రత్తలు అవసరం. ఆటలు, హాబీలు, ఫోన్ వాడకం కొంచెం తగ్గిస్తే మంచిది.
4. ఒక WhatsApp గ్రూప్ ఏర్పరచుకుని సబ్జెక్టు విషయాలు చర్చించుకోవచ్చు. నోట్సు, సైన్సు చిత్రాలు, గ్రాఫులు, నిర్మాణాలు మ్యాప్లు తేలికగా మార్పిడి చేసుకోవచ్చు. ఒక ఉపాధ్యాయుడిని Group Admin గా తీసికోండి.
5. మీకు సౌకర్యంగా ఉండే సమయంలో చదవండి. ఎంతసేపు చదివారన్నది ముఖ్యం. ఎప్పుడు చదివారన్నది ముఖ్యం కాదు.
6. సమాధానాలు చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను పెన్సిల్ తో Underline/ highlight చెయ్యండి.
7. ఒక విషయం రెండుసార్లు చదివినా అర్థం కాకపొతే వెంటనే ఉపాధ్యాయుని/ సహవిద్యార్ధిని అడగండి.
8. నేర్చుకున్న విషయం, పునర్విమర్శ కూడా చేసిన విషయం Tracking System ద్వారా గుర్తించండి. చివర నమూనా ఇయ్యబడినది.
9. విషయాన్ని బట్టి Mind Map, Concept Map, Flow chart వంటివి తయారు చేసుకోండి. చివర నమూనాలు ఇయ్యబడినవి.
10. జ్ఞాపకశక్తికి చిట్కాలు ఉండవు. బాగా నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి. గుర్తుండట్లేదు అంటే మరొక్కసారి నేర్చుకోండి. ఉపాధ్యాయుల సహాయం తీసికోండి.
11. చదివే విషయం అర్థం కావడానికి, ఆసక్తికి సంబంధం ఉంటుంది. వేరే ఆసక్తికి మార్గాలు ఉండవు.
12. మీకు ఈపాటికి ప్రశ్నాపత్రం నమూనా, ఏ సెక్షన్లో ప్రశ్నలకి ఎన్ని మార్కులుంటాయి అనేది తెలిసే ఉండాలి.
13. విద్యాప్రమాణాల ఆధారంగా ఏ సెక్షన్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలిసి ఉండాలి. లేదా బ్లూప్రింట్ గురించి ఉపాధ్యాయులను అడగండి.
14. ప్రశ్నాపత్రం చదవడానికి కనీసం పది నిముషాలు కేటాయించండి.
15. సమాధానాలు వ్రాయాలనుకున్న ప్రశ్నలను ప్రశ్నాపత్రంలో టిక్ చెయ్యండి. వ్రాసిన తర్వాత ప్రశ్నాపత్రంలో సర్కిల్ చెయ్యండి.
16. వీలైనంతవరకు ప్రశ్నాపత్రం క్రమంలోనే సమాధానాలు ఉండేట్టు చూసుకోండి. ఎగ్జామినర్ కు వీలుగా ఉంటుంది.
17. సమాధాన పత్రంలో ప్రశ్న సంఖ్య తప్పనిసరిగా వ్రాయండి. స్కెచ్ పెన్ వాడచ్చు కానీ ఎరుపు/ ఆకుపచ్చ వాడకూడదు.
18. నాలుగు వైపులా మార్జిన్స్ ఒక స్కెచ్ పెన్ వాడి గీయవచ్చు. ఎక్కువ రంగులు వాడకండి.
19. గణితంలో రఫ్ వర్క్ చూపించండి. సమాధానాన్ని బాక్స్ లో సూచించండి.
20. నిర్మాణం ప్రశ్నలో Rough Diagram కు మార్కులు వుంటాయి.
21. సైన్సులో బొమ్మ గీసిన తర్వాత భాగాలు అక్కడే గుర్తించాలి. సంఖ్య ఇచ్చి భాగం పేరు వేరొక చోట వ్రాయకండి.
22. సోషల్ స్టడీస్ లో కూడా మ్యాప్ ఉన్నచోటే ప్రదేశాన్ని గుర్తించాలి.
23. ఏ సబ్జెక్టులోనయినా సమాధానాల్ని పాయింట్స్ రూపంలో వ్రాయండి. వ్యాసాలు వంటివి running matter లా వ్రాయాలి.
24. ఒక ప్రశ్నకు పూర్తి సమాధానం వ్రాయలేకపొతే కొంచెం స్థలం వదలి తరువాత ప్రశ్నకు వెళ్ళండి. ఎక్కువ సమయం ఒకే ప్రశ్న వద్ద ఆగిపోకండి.
25. ఒక పేజిలో దాదాపు ఇరవై వరకు లైన్లు వస్తాయి. మరీ పెద్దగా లేదా చిన్నగా వ్రాయకండి.
26. నాలుగు మోడల్ ప్రశ్నాపత్రాల నుండి సమాధానాలు చదవండి. నాలుగు ప్రశ్నాపత్రాలు స్వయంగా ప్రయత్నించండి.