గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడ బెట్టడం కాదు మనషుల మనసులను గెలుచుకోవడం
బంధమంటే అన్నీ బాగున్నప్పుడు కలిసిఉండటం కాదు ఏమి లేనప్పుడు కూడా తోడుగా నిలవడం
స్నేహమంటే ఆనందాలప్పుడు చేతులు కలవడం కాదు కష్టాలప్పుడు నేనున్నానంటూ చేయూతనివ్వడం
గౌరవమంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు వ్యక్తిత్వాన్ని చూసి చేతులెతి మ్రొక్కడం
విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు జన్మంతా విలువల కోసం కట్టుబడటం
కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే చెవిలో నెమ్మదిగా చెప్పుంది ఏం పర్లేదు అంతా మంచే జరుగుతుంది
సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం
వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం
నిజం నిదానంగా నడుచుకుంటూ నట్టింట్లోకి వచ్చేసరికి పుకారు పరిగెడుతూ ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది కానీ సమయం వచ్చినప్పుడు నిజం ఆసనం ఎక్కి గౌరవం అందుకుంటుంది పుకారు ఆసనం కిందపడి నలిగిపోతుంది
నీ గురించి నీవే ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గోప్పవాడివి కాలేవు నీలో ఉన్నా వ్యక్తిత్వాన్ని ఇతరులు గోప్పగా చెప్పుకుని నిన్ను ఆదర్శంగా తిసుకునేలా బ్రతుకుతే తరతరాలు నీవు గోప్పవాడివని చరిత్రే చెపుతుంది
ఇతరుల మీద బురద జల్లేవారు ఎప్పుడో ఒకప్పుడు ఆ బురదలో పడతారు
బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది తెరిస్తే వెలుగు లేకుంటే చీకటి అలాగే శ్రమిస్తే సుఖం.లేదంటే దుఃఖం అంతా మన చేతిలోనే ఉంది
నా జీవితం గొప్పది అని ఎప్పుడు గర్వపడకు మనిషి జీవితంలో అద్రుష్టం అనేది ఎంత కాలం ఉంటుందో చెప్పలెము కానీ జీవితంలో ఎదో ఒకరోజు చావలా బతకాల అనే పరిస్తితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తు ఉండిపోయేలా చేస్తాయి జాగ్రత్త నేస్తమా !
జనన మరణాల మధ్య పయనం మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏమి చేయలేనేమో అనే భయం ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం
మనం అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం అలిసి పోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం దారిలోన చీకటైతే తోడురాదు నీడ జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ అందుకే నిన్ను మాత్రమే నమ్ముకో